నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన

వివిధ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు మరియు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్

లయన్స్ క్లబ్ సేవలు కొనియాడదగినవి – లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరు

నిడదవోలు: పెరవలి మండలంలో జరిగిన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవానికి మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘చిన్నా’ నాయకత్వంలో బాధ్యతలు స్వీకరించిన నూతన సభ్యులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిరంతరం ప్రజాసేవలో తరిస్తూ “సేవకు రారాజు”గా లయన్స్ క్లబ్ పేరుగాంచిందని, ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలు నెరవేరడంలో లయన్స్, రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. తాము చదువుకునే రోజుల్లో లయన్స్ క్లబ్‌కు అనుబంధంగా ఉన్న ‘లియో క్లబ్’లో సభ్యుడిగా చేరి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు మంత్రి గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపొందింపునకు లయన్స్ క్లబ్ ఒక మహోన్నత వేదికగా నిలుస్తుందన్నారు.పెరవలి మండల ఔన్నత్యాన్ని చాటుతూ సేవలందించిన పూర్వ అధ్యక్షులు ‘రాయుడు’ కార్యవర్గాన్ని అభినందించారు. స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పెరవలి ప్రాంతంలో లయన్స్ క్లబ్ చేపటే అన్ని సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

శ్రీ పుట్టలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు:

నిడదవోలు మండలం సూరాపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పుట్టలమ్మ తల్లి నూతన విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన భారీ అన్నసమారాధన కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన:

అనంతరం నిడదవోలు కార్యాలయం వీధి నందు నూతనంగా నిర్మించనున్న “స్వాతి హాస్పిటల్” భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన భూమిపూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకుని, స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యానికి సూచించారు

Scroll to Top
Share via
Copy link