80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు కోర్టు ఆవరణలో స్వతంత్రదినోత్సవ వేడుకలు లో భాగంగా జెండా వందన కార్యక్రమము నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని దేశప్రగతి, సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వహించాల్సిన నిరంతర సంకల్పమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని, తదుపరి కోర్ట్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలని, మొక్కలు నాటుట ప్రతి ఒక్కరు బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి శ్రీమతి సుంకర శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. కృష్ణ సత్యలత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. స్వర్ణ, రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీమతి కె. కృష్ణ వేణి, స్పెషల్ మేజిస్ట్రేట్ టి.వి.ఎస్.ఎస్. ప్రకాశ్, బెంచ్ మెజిస్ట్రేట్ జి.వి.వి.ఎస్. మూర్తి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ క్రాంతి ప్రసాద్, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్ట్ సూపరింటెండ్స్, సిబ్బంది పాల్గొన్నారు.




