సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం తణుకు బ్యాంక్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆవరణలో అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం అధ్యక్షులు కరుణాకర చౌదరి మాట్లాడుతూ నేటి రాజకీయ పరిస్థితులపై ప్రతి పౌరుడు ఎంతో విజ్ఞతతో నడవవలసిన అవసరం ఉందని సందేశం ఇచ్చినారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినెల నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను సభ్యులు క్రమం తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహమ్మద్ స్వాలిహ, ఉపాధ్యక్షులు కోడూరి వీరాంజనేయులు, కోశాధికారి అర్జీ భాస్కరరావు, జాయింట్ సెక్రటరీ శిరిగినీడి రామకృష్ణారావు, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రముఖులు పాల్గొన్నారు.




