80 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉండ్రాజవరం మండలం పాలంగి సహకార సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు కాకర్ల నరసన్న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖండ భారతావనికి త్రివర్ణ పతాక రూపశిల్పి మన తెలుగువారు కావడం గర్వకారణం అని అన్నారు. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నామని స్వాతంత్ర్యం అనేది కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదని దేశప్రగతి, సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వహించాల్సిన నిరంతర సంకల్పమని ప్రతి ఒక్కరు వారి త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మజీ సర్పంచ్ బొక్కా శ్రీనివాసు, సొసైటీ త్రిమేన్ కమిటీ సభ్యుడు దుర్గారావు, సోసైటీ ఉద్యోగులు కిషొర్, రామక్రిష్ణ, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.




