డి.ఎస్సి అక్రమాలపై పోరాటం.. పోలీసుల ఆంక్షల మధ్య భారీ ర్యాలీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం  నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, ఉండ్రాజవరం గ్రామంలో డి.ఎస్సీ అక్రమాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు పలు ఆంక్షలు విధించినప్పటికీ, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయ అభ్యర్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రజల తరఫున మా డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.
డి.ఎస్సి వ్యవహారంపై స్వతంత్ర సి.బి.ఐ. విచారణ జరగాలి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. నిరుద్యోగులకు నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం.. నిరుద్యోగ యువత హక్కుల కోసం.. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది
ఈ కార్యక్రమంలో  రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వివిధ అనుబంధ విభాగాల వైస్సార్సీపీ నాయకులు, రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు, నిడదవోలు మండల వైసిపి అధ్యక్షుడు అయినీడి పల్లారావు, కఠారి సిద్దార్థరాజు, వెలగన పోలయ్య, చిటికెన సూరిబాబు, దోనేపూడి సుధాకర్, కరెళ్ళ సోంబాబు, నిమ్మన శ్రీను, పోసిపొయిన రాజేంద్ర ప్రసాద్, నూక పెయ్యి టోని, మారిశెట్టి నాగేశ్వరరావు, దువ్వాపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Scroll to Top
Share via
Copy link