తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో ఆషాడమాస సారె సమర్పణ

తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో తణుకు పట్టణములో వేంచేసినటువంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ గోవిందమ్మకు, శ్రీ కామాక్షమ్మ వార్లకు ఆషాడమాసం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదరీమణులు అధిక సంఖ్యలో పాల్గొని సారె సమర్పించినారు తొలుత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ చైర్మన్ తమిరి శ్రీనివాస్ ఇంటి దగ్గర నుండి పట్టణ వీధుల మీదుగా భాజా భజంత్రీలతో ఊరేగింపుగా బయలుదేరి స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివార్లకు అమ్మ వార్లకు పూలమాలలను అలంకరించి అమ్మవార్లకు సారె, చీరలు సమర్పించినారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కావించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ గౌరవ అధ్యక్షుడు శొంఠియాన లక్ష్మణరావు, స్వర్ణకార సంఘ అధ్యక్షుడు నాగుమల్లి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు, కోశాధికారి గురజాపు శ్రీనివాసరావు, శీలామంతుల వెంకట అప్పలరాజు, పొడుగు సత్యనారాయణ, తమిరి వెంకట రామకృష్ణ ధర్మకర్తలు మరియు స్వర్ణకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link