వేల్పూరు సొసైటీ సేవలు ఆదర్శనీయం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే

రైతులకు సేవలు అందించడమే కాక ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. సొసైటీ త్రీ మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు ఆశ్రం ఆసుపత్రి భాగస్వామ్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ వేల్పూరు గ్రామంలో కంటికి సంబంధించిన ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు  చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఎవరికైనా రీడింగ్ సమస్యలు ఉంటే కళ్ళజోళ్ళు ఉచితంగా అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల నిర్వాహకులను అభినందించారు.  సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్, సభ్యులు ఆంజనేయులు, గణేష్ తో పాటు మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు, పెనుమర్తి వెంకటలక్ష్మి, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి నరేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చిక్కాల వేణు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link