సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక వేద హాస్పటల్ ప్రాంగణమందు తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా శుక్రవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అపరసంజీవని అన్నారు.
స్త్రీల ప్రసూతి వైద్యనిపుణురాలు డాక్టర్ రెడ్డి వేదవతి మాట్లాడుతూ సురక్ష తల్లి రొమ్ముపాలు అని, నవజాత శిశువు జన్మించిన వెంటనే అమృత ఆహారంగా రొమ్ముపాలను విధిగా పట్టించాలని అన్నారు. అనంతరం స్త్రీల ప్రసూతి వైద్య నిపుణురాలు రెడ్డి వేదవతిని, లోటస్ పిల్లల హాస్పటల్ మేనేజ్ మెంట్ నల్లగొండ రవళికను నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు.
ఇంకా ఈకార్యక్రమంలో హస్పటల్ మేనేజ్ మెంట్ అడబాల మణికంఠ, సిబ్బంది బుసర అఖిల, నెయ్యిల సరస్వతి, దెయ్యల సుష్మ, ఏల్లోజు సుస్మిత, సూర సుధారాణి, అల్లు జగదీష్, అవాల సాయికుమార్, టేకి సూర్య, సకలభక్తుల షారోన్, తల్లులు కూరాటి బాలభారతి,
కూరాటి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.




