లవ్ జిహాద్ కుట్రల ద్వారా బాధింపబడుతున్న కుటుంబాకు న్యాయం చేయండి

ఆగస్టు 24 (ఉండ్రాజవరం) కాకినాడ పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం లవ్ జిహాద్ ఉచ్చులో పడి రాజమండ్రి వద్ద గోదావరి నదిలో దూకి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవటం అత్యంత ఘోరమైన విషయమని జిల్లా బిజెపి కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ అన్నారు. ఉండ్రాజవరం మండలం బిజెపి అధ్యక్షుడు కొప్పినీడి సత్యనారాయణ అధ్యక్షతన లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న వేధింపులు ఆత్మహత్యలు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బిజెపి పార్టీ ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై డి.రవికుమార్ కు వినతి పత్రం అందించారు. రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిహాద్ సంఘటనలపై వెంటనే దర్యాప్తు జరగాలని బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆత్మహత్యలకు కారణమైన వాళ్లకు కఠిన శిక్షలు విధించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మండల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సెక్రటరీ బూరుగుపల్లి శివరామకృష్ణ, జిల్లా కిసాన్ మోర్చా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ, కొప్పినీడి సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటేశ్వర్లు, ఓబిసి జిల్లా కార్యవర్గ సభ్యులు నిడుమోలు చిన్న రాము, మండల ఉపాధ్యక్షులు ముళ్ళపూడి నాగేశ్వరరావు, ఆకెళ్ళ శ్రీనివాసరావు, మండల ఓబిసి ఉపాధ్యక్షులు ఐశెట్టి నాగ వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా మండల కార్యదర్శి చిట్టూరి పూర్ణచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link