ఉండ్రాజవరం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం

ఉండ్రాజవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉండ్రాజవరం మండలం సర్వసభ్య సమావేశం జరిగింది. ఉండ్రాజవరం జడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి శరత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు ఎంపీటీసీలకు వివరించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి నందిగం భాస్కర రామయ్య మాట్లాడుతూ తమ పదవీకాలంలో అధికారులు సహచర ఎంపీటీసీలు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. తమ హయాంలో ప్రతిపాదించిన అభివృద్ధి సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన నిడదవోలు ఏఎంసీ చైర్మన్ గాలింకి జిన్నాబాబు మాట్లాడుతూ మండలం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో వి. వి. ఎస్. రామారావు, వైస్ ఎంపీపీ చేట్టె నవీన్, ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link