ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఎన్జీఓ అవార్డు

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయ కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆదరణ సేవా ఫౌండేషన్‌కు ఎన్జీఓ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. సమాజ సేవలో భాగంగా గత 12 సంవత్సరాలుగా ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆదరణ సేవా ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి మాట్లాడుతూ, ఈ అవార్డు తమ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని అందించిందని, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link