ఎస్.కె.ఎస్.డి జూనియర్ కళాశాలలలో విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణ

స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా జూనియర్ కళాశాలలలో శనివారం విద్యార్థి సంఘం ఎన్నికలు కళాశాల నిబంధనలు ప్రకారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించబడ్డాయని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి భూపతిరాజు హిమబిందు తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ప్రచారానికి నిర్ణీత గడువు, అనంతరం పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించబడ్డాయని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించడం వలన విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల నియమాలు మరియు పారదర్శకత గురించి ప్రత్యక్షంగా తెలుసుకుంటారని తెలియజేశారు. ఈ ఎన్నికలలో విద్యార్థులు 4 పానల్స్ గా పోటీ చేయడం జరిగిందని 784 మంది విద్యార్థినులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం రెండవ పానల్ 94 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రకటించారు. వీరిలో చైర్పర్సన్ గా ఎస్. మోనశ్రీ (|| బై.పి.సి), సెక్రటరీ ఎ. సుమతి (11 ఎంపీ.హెచ్.డబ్ల్యూ), వైస్ చైర్పర్సన్ బి. మహి (1 సి. ఎస్.ఇ), జాయింట్ సెక్రటరీ బి. భువన లక్ష్మి చంద్రిక (1 ఎ & టీ), కల్చరల్ సెక్రటరీ కె. స్వాతి సత్యశ్రీ (1|| ఎం.పి. సి), జనరల్ కెప్టెన్ టి. పౌర్ణమి (1 ఎం.ఇ.సి) ఎన్నికయ్యారు. ఎన్నికైన విద్యార్ధి సంఘం ప్రతినిధులు కళాశాల అభివృద్ధి, విద్యార్ధుల సంక్షేమం మరియు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గెలుపొందిన విద్యార్ధులను ప్రిన్సిపల్ శ్రీమతి భూపతిరాజు హిమబిందు, కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం అభినందించారు

Scroll to Top
Share via
Copy link