భారతీయ జనతా పార్టీ ఓ బి సి మండల ఉపాధ్యక్షులుగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అయిశెట్టి నాగవెంకటేశ్వరరావు నియమితులయ్యారు. అలాగే భారతీయ జనతాపార్టీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన ఇర్రి లీలాకుమార్ నియమితులయ్యారు వీరిద్దరు నియామకం పట్ల రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింహాద్రి సత్యనారాయణ, మండల ఇన్చార్జి జిల్లా ఉపాధ్యక్షులు రంగినేడీ గంగాధర్, మండల అధ్యక్షులు కొప్పినేడీ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బూరుగుపల్లి వెంకటేశ్వర్లు జిల్లా కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ మండల ఉపాధ్యక్షులు ఆకెళ్ళ శ్రీనివాసరావు నాయకులు, ఓ. బి. సి. మండల అధ్యక్షులు పైపురి మాణిక్యాలరావు నాయకులు బూరుగుపల్లి కాశీ విశ్వనాథం, కరుటూరి రామకృష్ణ తదితరులు ఈ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషిచేయాలని అన్నారు.




