నర్సాపురం పార్లమెంటు సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ జన్మదినోత్సవం సందర్భంగా ఆచంట మండల బిజెపి అధ్యక్షుడు నేదునూరి శ్రీనుబాబు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆచంట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పేకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆచంట మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముచ్చర్ల నాగసుబ్బారావు మాట్లాడుతూ శ్రీనివాస్ వర్మ ఈ రెండేళ్లలో గోదావరి జిల్లావాసులకు నర్సాపురం నుండి దేశంలో అనేక ముఖ్య పట్టణాలకు రైల్ రవాణా సౌకర్యం, హైవేల నిర్మాణం, పాలకొల్లు ఆకివీడు బైపాస్ రోడ్డు నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రిలో నందు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు వంటి భారీ అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం కృషి చేస్తున్నారని, శ్రీనివాస్ వర్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి గోదావరి జిల్లా వాసులకు మంచి అభివృద్ధి ఫలాలు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రథాన కార్యదర్శి అందే బసవ గణపతి, జిల్లా నాయకులు పనసపండు, రామిశెట్టి రాము, కడలి రాజు, కోనా సత్య ప్రసాద్, దిర్సిపో శ్యాంబాబు, కాజ సర్వేశ్వరరావు, రాజేశ్వరరావు, ఈతకోట నరేష్, బందా సతీష్ శర్మ, జక్కంశెట్టి కోట్లమ్మ తదితరులు పాల్గొన్నారు.




