నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు భద్రందొర ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు 80 స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటిష్ వారి కంటే అధ్వానంగా పాలన సాగుతుంది మతోన్మాదం పెరిగిపోతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, దేశ అభివృద్ధి శూన్యం, దేశ సంపదంత కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య ఉంది అన్నారు. దేశ సంపదను దోచేసి బిజెపి తన యజమానులకు మాత్రమే అందిస్తుందని ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి పాలన ఎలా ఉందంటే బ్రిటిష్ కాలం నాటి పాల కంటే దుర్మార్గంగా ఉంది అన్నారు. ఇటువంటి సమయంలో మరో స్వాతంత్ర ఉద్యమం చేయక తప్పదు దానికి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తొలి అడుగు వేశారని ఆయన అన్నారు. వారితో పాటు మేము కూడా మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలుకుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు చిన్నం మురళీకృష్ణ, నిడదవోలు మండలం పెరవలి మండలం అధ్యక్షులు భావన రమేష్ బాబు, బుద్దల లక్ష్మణరావు, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ అగర్వాల్ హీరాలాల్, నియోజవర్గ ఎస్సి విభాగం చైర్మన్ కాకి కిషోర్, పట్టణ ఎస్సి విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, యువసేన కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ బషీర్, మహమ్మద్ అన్వర్ ఖాన్, మహమ్మద్ జమీర్ ఖాన్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మండ శారద, కళ్లెం ఆనందరావు, సీనియర్ నాయకులు వంగూరి వెంకన్న, ధరణిపతి, కప్పల ప్రసాద్, ఏ. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




