కొత్తపాడు సొసైటీలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు నియోజవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది ఈ స్వతంత్రం రావడానికి ఎంతోమంది త్యాగమూర్తులు మంగల్ పాండే 1857 సిపాయిల తిరుగుబాటు నుండి సుమారు 90 సంత్సరాల సుదీర్ఘ పోరాటంతో మనకు స్వాతంత్రం లభించింది ఇందులో ముఖ్యంగా సరోజినీ నాయుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మంగళ్ పాండే, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్రప్రసాద్, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ రాణి, సాజి బాదుషా, మన ఆంధ్ర ప్రాంతం నుంచి టంగుటూరు ప్రకాశం గారు, అల్లూరి సీతారామరాజు, గిడుగు రామ్మూర్తి, తణుకు ప్రాంతవాసి వంక సత్యనారాయణ గారు ఇలా ఎంతోమంది త్యాగమూర్తులు పుణ్యఫలం మనకి స్వాతంత్రం ఇందులో ముఖ్యంగా అహింస అనే ఆయుధంతో మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్యులు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పాలించుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు, ఉపాధ్యాయులు సొసైటీ, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడి ఆశ వర్కర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link