కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని వైఎస్సార్సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్‌నాయుడు ధ్వజమెత్తారు. డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని, మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకుసుకున్న అవకతవకలపై నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలులోని ఆర్వోబీ వద్ద జి.శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీసీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత కలిసి శనివారం రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారని, రెండేళ్లలో ఒక్క పైసా కూడా భృతి ఇవ్వలేదన్నారు. పేద, మధ్య తరగతి పిల్లల కోసం వైఎస్సార్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. డీఎస్పీ పరీక్షా పేపర్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో, వాళ్లే ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. లోకేష్ వెంట నడిచిన వారికే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటా అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు, పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ఆరేపలి వెంకటేష్, ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ వెలగన పోలయ్య, పార్టీ నాయకులు సుంకవల్లి శ్రీహరి, గజ్జరపు శ్రీరమేష్, తిరుమళ్ల దుర్గారావు, యాళ్ల రామారావు, ఆరేపల్లి చంటి తదితరులు సంఘీభావం తెలిపారు.
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న నాయకులు :
- మానుకొండ చంద్రబాబు (వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు)
- దల్లి కనకేష్రెడ్డి (వైఎస్సార్సీపీ సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్ఛార్జ్)
- రొట్టే నవీన్‌కుమార్ (వైఎస్సార్సీపీ నిడదవోలు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు)
- కఠారి సిద్ధార్థ (వైఎస్సార్సీపీ నిడదవోలు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు)
- వెలగన నరేష్ (వైఎస్సార్సీపీ మండల యూత్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్)
- బయ్యే నాగ విజయ్ (వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు)
- కొప్పుల రామదేవుడు (వైఎస్సార్సీపీ తాడిమళ్ల గ్రామ అధ్యక్షుడు)
- కస్తూరి సాగర్ (వైఎస్సార్సీపీ రైతు విభాగం నాయకులు)
- కొత్తూరి శ్రీనివాస్ (వైఎస్సార్సీపీ నాయకులు)
- బయ్యే సత్తిపండు (వైఎస్సార్సీపీ నాయకులు)
11.ఎం.ప్రవీణ్‌కుమార్ (వైఎస్సార్సీపీ నాయకులు) - అంబటి కిషోర్ బాబు (వైఎస్సార్సీపీ నాయకులు)
- షేక్ భాషా (వైఎస్సార్సీపీ నాయకులు)




