పేపర్ లీకేజీలు , పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా ఐసా ఆధ్వర్యంలో నిరసన

పేపర్ లీకేజీలు , పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా ఏ ఐ యస్ ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతా లో భాగంగా నిన్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచి లో ఆమెపై కొంతమంది అల్లరి మూకలు దాడి చేసి సిరా ఇంక్ పోయడాన్ని ఐసా గా తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఏ ఐ యస్ ఏ.. జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి. ఎస్ ఎన్ పి ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళి కుమార్ లు విమర్శించారు.
ఈ మేరకు నిన్న కామ్రేడ్ నేహాపై జరిగిన దాడికి నిరసనగా శనివారం తణుకులో స్థానిక వెంకటేశ్వర సెంటర్ నందు ఐసా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమమునకు విచ్చేసిన.. ఐసా జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి , ఎస్ ఎన్ పి ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరు మురళి కుమార్ లు మాట్లాడుతూ రాంచీలో ఐసా , ఆర్ వై ఏ.ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలు పరీక్షల అవినీతి కి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీపై జరిగిన గుండాల దాడి అత్యంత హేయమైన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యని వారు విమర్శించారు ముఖ్యంగా ఐసా జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా పై ఒక అగంతుక వ్యక్తి సిరా ఇంక్ పోయిడాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని దీని వెనుక ఆర్ఎస్ఎస్ , బిజెపి నాయకుల ప్రొద్ బలం ఉన్నట్లు మేము అనుమానం వ్యక్తం చేస్తున్నామని వారు అన్నారు దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు దాడులతో ఉద్యమాన్ని ఆపలేరని ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమమే దీనికి నిదర్శనమని వారు తెలిపారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలలో భాగంగా ఎన్ ఈ పి రద్దు చేయాలని , నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని తదితర డిమాండ్ల సాధనకు ఐసా జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ నేహ ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త జాతాకి విద్యార్థులు యువకులు తమ సంఘీభావం ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, ఎస్ ఎన్ పి ఎస్ జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్ , ఎలిపే సురేష్, ఐసా నాయకులు యు మురళి, జి పృద్వి , వి .లోకేష్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link