వెలగదుర్రు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి  ఇంటింటికి ప్రచారం.

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో  శుక్రవారం  ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించి, ప్రభుత్వ విజయాలు తెలియచేసి కరపత్రాలను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ , నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు.  ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్ళలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో పరిపాలనను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, వెలగదుర్రు గ్రామ టిడిపి అధ్యక్షులు ముదునూరి రవీంద్ర రాజు, వెలిచేటి హరిశ్చంద్ర ప్రసాద్, కాల్దారి సొసైటీ అధ్యక్షులు కోమట్ల పల్లి రామదాసు, మండల ఎస్.సి.సెల్ నాయకులు పాతూరి నరేంద్ర, తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ, వార్డు నాయకులు, కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జులు, బూత్ ఇంచార్జులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link