వార్త‌లు

విద్యార్థులకు రాజ్యాంగ విలువలు అందించాలి – డి.వి.వి.యస్. వర్మ

దేశాన్ని నడిపించే రాజ్యాంగాన్ని, దాని విలువలను విద్యార్థులుకు బోధించాలని ప. గో. జిల్లా రాజ్యాంగ ప్రచార వేదిక కన్వీనర్ డి. వి. వి. యస్. వర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక యస్. సి.ఐ. యం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన అధ్యాపకులు- ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ అన్ని సంస్థలు నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవం లో పాలుపంచుకుని సామూహికంగా “ రాజ్యాంగ పీఠిక పఠనం- పీఠిక ప్రతిజ్ఞ నిర్వహించాలని కోరారు. […]

వార్త‌లు

పద్మశాలి ప్రముఖులచే తిరుచానూరు పద్మావతిదేవికి సారె సమర్పణ 

 ప్రతియేటా జరిగే తిరుచానూరు పద్మావతి దేవికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుండి పద్మశాలి ప్రముఖులు, తిరుపతిలో ఉన్న అఖిల భారత పద్మశాలి కళ్యాణమండపం నందు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం, తిరుచానూరులో అమ్మవారికి సారి చీర పసుపు కుంకుమలు మొదలగు వస్తువులతో దేవాలయ ప్రాంగణంలో నుండి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి మంగళ వాయిద్యాల మధ్య సుమంగళి వస్తువులను అమ్మవారికి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా  ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాజీ మంత్రి మురుగుడు

వార్త‌లు

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా 100 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి కందుల దుర్గేష్

తనకు దక్కిన అదృష్టంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేష్ పుట్టపర్తి: సామాజిక సేవకు, మానవ సంక్షేమానికి ఆధ్యాత్మికతను సాధనంగా మలిచిన మహనీయుడు శ్రీ సత్య సాయిబాబా ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. ప్రముఖ ఆధ్యాత్మికక్షేత్రం పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తుల సమక్షంలో 100

వార్త‌లు

సీఐ శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన పోలీస్ శాఖ

ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న సీఐ శంకరయ్య… సీఐ శంకరయ్య సమక్షంలోనే వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపి వేశారని గతంలో ఆరోపించిన చంద్రబాబు. తనపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్న సీఐ శంకరయ్య.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇటీవలే లాయర్ ద్వారా సీఎం చంద్రబాబుకు పరువు నష్టం దావా నోటీసులు పంపిన శంకరయ్య. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగించిన పొలీసుశాఖ

వార్త‌లు

తణుకు నియోజకవర్గానికి గోదావరి జలాలు

ధవళశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా తరలింపు రూ. 54 కోట్లు వ్యయంతో ప్రాజెక్టుకు రూపకల్పన రూ. 1600 కోట్లుతో సంక్షేమం, అభివృద్ధి అమలు దువ్వలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గ ప్రజలకు గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇందుకోసం ధవళశ్వరం నుంచి పైపులైన్లు ద్వారా తాగునీటిని తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు వెల్లడించారు తణుకు మండలం దువ్వ గ్రామంలో శుక్రవారం ఈ పథకానికి

వార్త‌లు

సత్యసేవా సమితి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలి

శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణసత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన సేవాకార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అందర్నీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ సత్యసాయి చెబుతున్న ప్రవచనాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సత్యసాయి శత జయంతి పురస్కరించుకుని సత్యసాయి సంస్థ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను

వార్త‌లు

తణుకు పురుషుల శాఖా గ్రంథాలయంలో ఘనంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవం

తణుకు, నవంబర్ 20, 2025 : దాతల సహకారంతో తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఉదయం, గత వారం రోజులుగా జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభకు చీకటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. సభలో అతిథిగా పాల్గొన్న స్థానిక ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కలగ నాగ వెంకట రామ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, గ్రంథాలయాలు సందర్శించి విజ్ఞానం

వార్త‌లు

ఎస్.కె.ఎస్.డి. మహిళా కళాశాలలో సి.పి.ఆర్ అవగాహన సదస్సు

స్థానిక ఎస్.కె.ఎస్.డి. మహిళా పి.జి కళాశాల (అటానమన్) తణుకులో – రోటరీ క్లబ్’- తణుకు వారి అధ్వర్యంలో సి.పి.ఆర్. అవగాహాన సదస్సును ఏర్పాటు చేశారు. కళాశాల ఫ్రీన్సిపాల్ కెప్టెన్ యు.లక్ష్మి సుందరీ బాయి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రోటరీక్లబ్ – తణుకు ప్రెసిడెంట్ డా ॥ కలగర వెంకట కృష్ట మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా మెగా వైద్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సి.పి.ఆర్ వంటివి నిర్వహించి ప్రజలను చైతన్య

వార్త‌లు

పుట్టపర్తి శతజయంతి ఉత్సవాల్లో భాగస్వామిని కావడం పూర్వ జన్మసుకృతం – మంత్రి కందుల దుర్గేష్

పుట్టపర్తికి విచ్చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు పుట్టపర్తి: పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబ శతజయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించే క్రతువులో మంత్రి కందుల దుర్గేష్ భాగస్వామి అయ్యారు. ఏపీ ప్రభుత్వం సత్యసాయి శతజయంతి ఉత్సవాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి కందుల దుర్గేష్ సభ్యుడు కావడంతో పరిశీలన బాధ్యతలు చేపట్టి భక్తులకు అందుతున్న ఏర్పాట్లను సహచర మంత్రులతో కలిసి స్వయంగా పరిశీలించారు.

వార్త‌లు

హిందూ సంప్రదాయాలని అపహాస్యం చేసిన వైసీపీ

తిరుపతి లడ్డూను సైతం కల్తీ చేసిన వైసీపీ నేతలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు బల్లిపాడు మదనగోపాలస్వామి ట్రస్టు బోర్డు అభినందన సభ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ సంప్రదాయాలను అపహాస్యం చేసే విధంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గతంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాలకులు సైతం తిరుపతి లడ్డూను పూర్తిగా కల్తీమయం చేశారని విమర్శించారు. అత్తిలి మండలం బల్లిపాడు మదనగోపాల స్వామి దేవస్థానం

Scroll to Top