శతజయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ
సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన సేవాకార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అందర్నీ ప్రేమించు అందరినీ సేవించు అంటూ సత్యసాయి చెబుతున్న ప్రవచనాలు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సత్యసాయి శత జయంతి పురస్కరించుకుని సత్యసాయి సంస్థ సభ్యులు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా నిత్యాన్నదాన వితరణ సేవా కేంద్రాన్ని ప్రారంభించి 2017 నుంచి నిరంతరాయంగా అన్నదాన వితరణ కొనసాగించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తదితరులు పుట్టపర్తి వెళ్లి స్వామివారి మహాసమాధి వద్ద నివాళులు అర్పించారని కొనియాడారు. ఈ సందర్భంగా
సత్యసేవా సమితి సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


