సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రామాయణం రచించిన మొల్ల
మొల్ల జయంతి అధికారికంగా నిర్వహించుకోవడం అభినదనీయం
జయంతి వేడుకల్లో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకులో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలు
కుమ్మరి శాలివాహన కులంలో ఆణిముత్యంగా జన్మించిన మొల్లమాంబ 16వ శతాబ్దపు తెలుగు కవిత్రి అనీ తెలుగులో మొల్ల రామాయణాన్ని రచించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీర్చి దిద్దారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి గాంచిందని తెలిపారు. కవయిత్రి మొల్లమాంబ 586 జయంతి పురస్కరించుకుని తణుకు సొసైటీ రోడ్డులోని మున్సిపల్ పార్కు వద్ద మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నరసాపురం పార్లమెంటరీ కుమ్మర సమితి కన్వీనర్, కుమ్మర శాలివాహన సంఘం రాష్ట్ర నాయకులు చుంచుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. మొల్ల శ్రీకృష్ణదేవరాయులు కాలానికి చెందిన వారని, రామాయణాన్ని ఆరు భాగాలుగా 20 అధ్యాయాలుగా రచించి ఆంధ్ర ప్రజలకు అందించారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కవిత్రి మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన చుంచుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొల్లమాంబ కుమ్మరి శాలివాహన కుటుంబంలో జన్మించిన ముద్దుబిడ్డని ఆమె కడప ప్రాంతంలో గొప్ప కవయిత్రిగా జీవించిందని ఆమె చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టినప్పటికీ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని రామాయణాన్ని రచించిందని చెప్పారు. ఆమె వినయం, ప్రతిభ కారణంగా ప్రజలు ఆమెను చాలా గౌరవించే వారిని ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో మల్లమాంబ పేరు ఎంతో గౌరవంగా చెప్పబడుతుందని అన్నారు. సామాన్య ప్రజలందరకీ అర్థమయ్యేలా రామాయణ కథను తెలుగులో రాయాలని నిర్ణయించుకుని ఆమె చాలా కష్టపడి రామాయణం రచించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు మొల్ల జయంతిని అధికారికంగా ప్రకటించలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొల్ల జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తేతలి గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆశోక్‌వర్మ, మున్సిపల్ డీఈ ఈశ్వరరెడ్డి, టిడిపి పట్టణ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు తమరాపు రమణమ్మ, తమరాపు సత్యనారాయణ, కడియాల సూర్యనారాయణ, గుబ్బల శ్రీనివాస్, తాతిపూడి మారుతీరావు, జయం వెంకటేష్, గురుజుకోట నాగసతీష్, యల్లా సుబ్రహ్మణ్యం, పెనుగొండ కృష్ణమూర్తి, చుంచుల శివయ్య, చుంచుల ధర్మారావు, పెనుగొండ మీరా సాహెబ్, కాసా నాగరాజు, బిరుదుకోట చింతన్న, తదితరులు తోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి కుమ్మరి శాలివాహన సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


