ప్రతియేటా జరిగే తిరుచానూరు పద్మావతి దేవికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుండి పద్మశాలి ప్రముఖులు, తిరుపతిలో ఉన్న అఖిల భారత పద్మశాలి కళ్యాణమండపం నందు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మవార్లకు కళ్యాణం, తిరుచానూరులో అమ్మవారికి సారి చీర పసుపు కుంకుమలు మొదలగు వస్తువులతో దేవాలయ ప్రాంగణంలో నుండి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి మంగళ వాయిద్యాల మధ్య సుమంగళి వస్తువులను అమ్మవారికి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి, అఖిలభారత పద్మశాలి అధ్యక్షులు కందగడ్ల స్వామి, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళ దేవి, వెంకట రమేష్ దంపతులు, జగ్గారపు శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు, గంజి చిరంజీవి, అఖిల భారత పద్మశాలి సత్రం మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్, మాజీ అధ్యక్షులు జెల్లా లక్ష్మీనారాయణ, ప్రస్తుత అధ్యక్షుడు వద్దిసత్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి అమ్మవారికి ఈ విధంగా సారీ సమర్పిస్తున్నామని తెలియజేశారు. సాక్షాత్తు అమ్మవారే నేను పద్మశాలి ఆడబిడ్డనని అన్నమాచార్యుల వంశీయులకు ఆకాశవాణి ద్వారా తెలియపరచినట్టు పురాణాల్లో పొందపరిచి ఉన్నట్టుగా ఆమె తెలియపరిచారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలుపుతూ ఈ బృహత్తర కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుగా చంద్రబాబునాయుడు పద్మశాలీలను గౌరవిస్తూ జీవో పాస్ చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటుగా ముందుగా జానకి,చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్, అమృత ప్రెస్ ఉద్దేశించి మాట్లాడడం జరిగినది. ఓబుళపతి నేతృత్వంలో ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భారీగా పద్మశాలి కుల ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.


