ప్రజల యొక్క రక్త మాంసాలను పిండి వాటి ద్వారా సంపద సృష్టిస్తున్నారా – మాజీ మంత్రి కారుమూరి
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ బిల్లులు పెంచము నాణ్యమైన కరెంటు అందిస్తాం అని చెప్పిన కూటమి నాయకులు నేడు 15,485 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల నెత్తిన పెట్టారు అని రాష్ట్ర మాజీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా తణుకు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అంటూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా […]










