నిడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్
రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బి.టి, సి.సి రోడ్ల మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్
స్వయంగా ప్రోక్లైన్ నడుపుతూ పనులు ప్రారంభించిన మంత్రి దుర్గేష్
మరో నాలుగైదు నెలల్లో రూ. 30 కోట్లతో రోడ్లపై ప్రత్యేక దృష్టి.. ప్రణాళికలు తయారు చేస్తున్నామన్న మంత్రి దుర్గేష్
నిడదవోలు: రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం నిడదవోలు పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో “గుంతల రహిత ఆంధ్రప్రదేశ్” కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని స్వయంగా ప్రోక్లైన్ నడుపుతూ పనులు ప్రారంభించారు. రూ.45 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో గల బి.టి రోడ్డు మరియు సి.సి రోడ్ల మరమ్మతుల పనులకు స్థానిక అధికారులు, కూటమి నేతలతో కలిసి ఈ మేరకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి రూ. 11 కోట్ల నిధులు తీసుకొచ్చామని, రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ ఆ దిశగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఖజానాలో డబ్బులు లేనప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలవద్దన్న ఉద్దేశంతో గుంతల పురుష కార్యక్రమం చేపట్టామని మంత్రి అన్నారు.. రాబోయే రోజుల్లో వీటిని పక్క రోడ్లుగా వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల విషయంలో స్థానిక భవన కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా, వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ సిసి రోడ్లు అవసరం గుర్తించి నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు.. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే సంబంధిత పనులు ప్రారంభిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఉన్న సాన్నిహిత్యంతో నిడదవోలు నియోజకవర్గానికి మరిన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరో నాలుగైదు నెలల్లో రూ. 30 కోట్లతో రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేస్తామన్నారు.. ఇప్పటికే సంబంధిత ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అంబేద్కర్ కాలనీలో పనులు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు.. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని మంత్రి దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్ పర్సన్ గంగుల వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు, మునిసిపల్ కమిషనర్ కృష్ణవేణి, డీఈ హరిబాబు, కూటమినేతలు వెంకటేశ్వర్ రావు, రంగ రమేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


