అత్తిలి మండలం పాలి గ్రామంలో పోలింగ్ బూత్ No: 153 లో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారి వాజ్‌పేయి 100వ జయంతి, సుపరిపాలన దినోత్సవం ఈ సందర్భంగా 153 పోలింగ్ బూత్ నూతన అధ్యక్షులు మల్లిడి కలికిరెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ సభ్యులు వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ అందరికీ ఆదర్శప్రాయుడు, స్ఫూర్తి దాత భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25న కృష్ణబిహారీ వాజ్‌పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్‌పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణుపరీక్ష, నేషనల్ హైవేస్, గ్రామీణ సడక్ రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవచేశారు. ప్రతీ రాజకీయపార్టీ మెచ్చిన నాయకుడుఅటల్ బీహారి వాజ్‌పేయిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని అని వెంకటరెడ్డి అన్నారు. అనంతరం 153 పోలింగ్ బూత్ అధ్యక్షులుగా మల్లిడి కలికి రెడ్డిని ఏకగ్రీవంగా బూత్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ద్వారంపూడి వెంకటసుబ్బారెడ్డి, పాలి నీటిసంఘం డైరెక్టర్ మేడపాటి అప్పారెడ్డి, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, వెలగల్ శ్రీనివాసరెడ్డి, సత్తి సాయిరెడ్డి ,రామిరెడ్డి, సుబ్బిరెడ్డి, బూత్ సభ్యులు పాల్గొన్నారు.


