తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం గ్రామంలో భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయ్ శతజయంతి కార్యక్రమం బిజేపి నాయకుల ఆద్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.బిజేపి నాయకునిగా, ప్రధానిగా దేశానికి అమూల్యమైన సేవలు అందించిన వాజ్ పేయి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి కిసాన్ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు బూరుగుపల్లి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చిట్టూరి సాయిబాబు, ఆకెళ్ళ శ్రీనివాసరావు, బి. షర్మిల, ఏలేశ్వరపు భాస్కరరావు, ఏలేశ్వరపు యజ్ఞన్నారాయణ, అక్కిన శ్రీరాములు, ఎం.డి. రియాజ్ తదితరులు వాజ్ పేయికి నివాళులర్పించారు.


