బి.జె.పి.ఆధ్వర్యంలో జనతా వారధిపై జె.సి.కి వినతిపత్రం

“జనతా వారధి” కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాకు సంబంధించిన భూగర్భ జలాల పరిరక్షణ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ చేపట్టిన “క్యాచ్ ది రెయిన్” కాన్సెప్ట్ అమలుపై భారతీయజనతాపార్టీ తరుపున జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ టి. రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేయడం జరిగింది.

ఈ వినతిపత్రంలో జిల్లాలోని చెఱువుల పూడికతీత, ఇంకుడు గుంటల నిర్మాణం, రీఛార్జి గుంతల ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా చేపట్టి, ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టే విధంగా “గ్రౌండ్ వాటర్ రీఛార్జి మిషన్”ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ,“జనతా వారధి” కన్వీనర్ తోట గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ వర్మ, అలాగే పార్టీనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి ని మర్యాదపూర్వకంగా కలిసి, ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆమె “సర్క్యులర్ ఎకానమీ” అంశంపై ఇచ్చిన ప్రజెంటేషన్‌ను ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ప్రశంసించిన సందర్భంగా అభినందనలు తెలియజేసి, అలాగే జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందిస్తున్న కలెక్టర్ నాగరాణి కి శుభాకాంక్షలు బిజెపి నేతలు తెలిపారు.

Scroll to Top
Share via
Copy link