తణుకు పట్టణంలో అర్థరాత్రి సామాన్య వ్యక్తిలా బైక్పై పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవల పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, డ్యూటీ డాక్టర్లు మరియు సిబ్బందితో మాట్లాడి మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఇదే సమయంలో హై బీపీతో అత్యవసర పరిస్థితిలో ఏలూరుకు రిఫర్ అయిన తణుకు రెండవ వార్డుకు చెందిన గర్భిణి అనూషకు ఎమ్మెల్యే స్వయంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి వెంటనే మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అక్కడి వైద్యులతో నేరుగా మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రజారోగ్యం పట్ల అప్రమత్తతతో పాటు ఆపదలో ఉన్న గర్భిణికి అండగా నిలిచిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సేవాభావం స్థానికుల ప్రశంసలు అందుకున్నారు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.



