వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచిన  రూట్స్ స్కూల్ విద్యార్థులు

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ విద్యార్థులు వరుసగా రెండోసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తణుకు టౌన్ ఫస్ట్ సాధించిన రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థిని పి.బాల సత్య హరిణి 596/600 ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి శాలువా, మెమెంటో మరియు పుష్ప గుచ్ఛంతో అభినందించారు. రూట్స్ స్కూల్ విద్యార్థిని పి. బాల సత్య హరిణికి టౌన్ ఫస్ట్ రావడం గర్వకారణమని ఆయన తెలిపారు. ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఫలితంగా ఈ ఘన విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి, డైరెక్టర్స్ బి. విద్యాకాంత్, సుధాకర్ వర్మ, కూటమి నాయకులు మరియు తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link