సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) ప్రాంగణ మందు ఆచార్య ఆత్రేయ జయంతిని ఘనంగా గురువారం నిర్వహించారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు మాట్లాడుతూ కథ చిత్ర పాత్రోచిత మైన పాటలు, మాటలు రాసిన ఆత్రేయ మనసు కవి మహాకవి అని అన్నారు.
పై సందర్భంగా ఆత్రేయ రచించిన పాటలు, జీవిత చరిత్రపై సదస్సు నిర్వహించారు పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం స్కూల్ ఉపాధ్యాయుడు చీలి రాజును, ఉపాధ్యాయురాలు ఉనికిలి భాను శ్రీలక్ష్మిని, నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు చెక్కా శైలజ, ముక్కామల మోహన రావు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.



