వార్త‌లు

మాజీ మంత్రి అమర్నాథ్‌ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

హోం మంత్రి అనితకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజం రాష్ట్ర హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తణుకు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు మహిళలు తీవ్రస్థాయంలో ధ్వజమెత్తారు. పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అయేషాఖాన్‌ మాట్లాడుతూ మహిళలను కించపర్చుతూ మంత్రి అనితను ఉద్దేశించిన అమర్నాథ్‌ చేసిన […]

వార్త‌లు

టి.బి. నిర్ధారణకు అత్యాధునిక ఏ.ఐ. ఆధారిత ఎక్సరే పరీక్షలు

మంగళవారం పాలంగి గ్రామం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నందు ఏఐ ఆధారిత ఎక్స్ రే పరీక్షల ఉచిత వైద్య శిబిరం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.బి.దుర్గా మహేశ్వరరావు ఆధ్వర్యంలో టీబి యూనిట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి నిర్వహించారు, టీబీ వ్యాధి పై జరిగిన అవగాహన సదస్సులో డా. దుర్గామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి టీ.బి. అభయాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించడం కోసం ప్రభుత్వం 100 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, దీనిలో

వార్త‌లు

ఓటర్ల వివరాల సేకరణ ఫారాల పంపిణీ ప్రారంభం – తహసీల్దార్ ప్రసాద్

భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలోని 139వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల (EFs) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించినట్లు తహసీల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేసి వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఓటర్లు

వార్త‌లు

కారుమూరి…. కారు కూతలు మానుకో

రాజకీయాల్లో చౌకబారు వ్యాఖ్యలు సరికాదు భవిష్యత్తుపై భయంతోనే కారుమూరి వ్యాఖ్యలు కులాలపై చిచ్చులు పెట్టిన మాజీ మంత్రి కారుమూరి కారుమూరిపై మండిపడిన తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులకు ఆదర్శంగా ఉండాల్సిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డారు. సోమవారం తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. భవిష్యత్తుపై

వార్త‌లు

పాపికొండలకు వెళ్తున్న బోటులో సాంకేతిక లోపం

పోలవరం జిల్లాలోని పాపికొండల విహారయాత్రకు బయలుదేరి వెళ్లిన పర్యాటక బోటు.. సాంకేతికలోపం తలెత్తడంతో గోదావరిలో నిలిచిపోయింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారం ఉదయం ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరారు. నదిలో దేవీపట్నం పాత పోలీసుస్టేషన్‌ ప్రాంతానికి వెళ్లే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు (డ్రైవర్‌) నిలిపి వేశాడు. సమాచారాన్ని కంట్రోల్‌ రూం అధికారులకు చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారు. బోటు పాయింట్‌ నుంచి వెంటనే

వార్త‌లు

రాష్ట్రంలో “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై కేసులు – మాజీ మంత్రి కారుమూరి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి, మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని

వార్త‌లు

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

గత సంవత్సరము అక్టోబర్ నెలలో తణుకు పట్టణములో ఉండ్రాజవరం రోడ్డులో గల స్మశానాల దగ్గర 5 కేజీల గంజాయినీ రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి మండపాక గ్రామానికి చెందిన పోలవరపు కుమార శివ (21) అనే వ్యక్తి నీ తణుకు ఎక్సైజ్ అధికారులు బుధవారము అరెస్టు చేయడం జరిగింది. ఒరిస్సాలో మల్కాన్గిరి నుండి గంజాయిని కేజీ రెండువేల చొప్పున కొనుగోలు చేసి తణుకు పట్టణ పరిసరాలలో కేజీ 3000 కి టోకుగా

వార్త‌లు

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి

భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో తణుకులో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో పూజలు చేయడం జరిగిన ఆ స్వామివారి ఆశీస్సులు ప్రధానిపై ఉండాలని వారికి ఆయురారోగ్యాలు, శక్తిని ప్రసాదించాలని బిజేపి శ్రేణులు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో డా. ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ

వార్త‌లు

స్టీల్ ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల

వార్త‌లు

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

ఉండ్రాజవరం: క్షయ రహిత సమాజమే ధ్యేయంగా దాతలు ముందుకొచ్చి, పలువురికి ప్రేరణ కల్పించాలని టీ.బీ. వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ అందించిన దాత, జర్నలిస్ట్ వెంకట సత్యసాయి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం, ఉండ్రాజవరం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో టీ.బీ. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ క్షయ రోగులందరూ

Scroll to Top