తాడిపర్రు జడ్పీ హైస్కూల్‌కు 90% ఉత్తీర్ణత…

ఉండ్రాజవరం, ఏప్రిల్ 30:
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని జి.వి.ఎస్.ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచింది. 2026 ఏప్రిల్ 30న ప్రకటించిన ఫలితాల ప్రకారం, మొత్తం 59 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 53 మంది ఉత్తీర్ణులై 90 శాతం ఫలితాన్ని సాధించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపించారు. కే. రేణుక 547 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. కే. అమృత 515, వి. రిష్మ 512, టి. నాగవల్లి ప్రవల్లిక 512, ఏ. చైత్రిక 507, హంస నందిని 503, వై. సుశాంత్ 502, కే. సాయి నిహారిక 500, పి. హేమంత్ 500 మార్కులు సాధించి 500కు పైగా మార్కులతో మెరిశారు.
విద్యార్థుల ఈ విజయంపై గ్రామ సర్పంచ్ నరేంద్రబాబు, హెడ్‌మాస్టర్ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, ఎస్‌ఎంసీ సభ్యులు, అధికారులు విద్యార్థులను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల కారణమని వారు పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link