ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు

జలజీవన్ మిషన్ పథకం ద్వారా రక్షిత తాగునీరు

ఇరగవరం మండలంలో రూ. 56 కోట్లతో పనులు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

కె.కుముదవల్లి గ్రామంలో వాటర్ ట్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యే
ఇంటింటికి రక్షిత తాగునీరు కుళాయిల ద్వారా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో 48 గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా రూ. 56 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఇరగవరం మండలం మండలం కె.కుముదవల్లి గ్రామాలు 40 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంకును గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు మండలంలోని తూర్పువిప్పర్రు, కె.ఇల్లెంద్రపర్రు, సూరంపూడి, పేకేరు, ఓగిడి, ఏలేటిపాడు, ఐతంపూడి గ్రామాలకు నిరంతరాయంగా తాగునీరు అందించే విధంగా కోట్లు వ్యయంతో పనులు చేపట్టామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. జలజీవన్ పథకంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎక్కడ పనులు అక్కడే వదిలేసారని విమర్శించారు. వాళ్ళ కమిషన్లు కోసం అనేక గ్రామాల్లో కనీసం పనులు పూర్తి చేయకుండా ఎక్కడికి అక్కడే వదిలేసారని గుర్తు చేశారు. దుర్మార్గమైన పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జలజీవన్ పథకాన్ని పూర్తిస్థాయిలో అటక ఎక్కించారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జలజీవన్ మిషన్ పనులను తిరిగి పునః ప్రారంభించారని చెప్పారు. రాష్ట్రంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో రూ. 1400 కోట్లు వ్యయంతో పనులను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link