తణుకు నియోజకవర్గంలో 81 శాతం ఉత్తీర్ణత
విద్యార్థులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు
మంత్రి నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతోనే నాణ్యమైన విద్య అందుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు రావడం అభినందనీయమని అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.తణుకు నియోజకవర్గంలో 81 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు కావడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. అత్తిలి మండలంలో అత్యధికంగా 90 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు కాగా ఇరగవరం మండలంలో 85శాతం, తణుకు మండలంలో 68 శాతం చొప్పున ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు చెప్పారు. ఇరగవరం జడ్పీ హైస్కూలు విద్యార్థి శీలబోయిన దివ్యశ్రీ సాయి 589, రేలంగి జడ్పీ హైస్కూల్ విద్యార్థి మారిశెట్టి శ్రీ మహాలక్షి్మ 579, తూర్పువిప్పర్రు జడ్పీ హైస్కూల్ విద్యార్థి కాకర్ల దీక్షిత 578, ఆరవల్లి జడ్పీ హైస్కూలు విద్యార్థి కె.తన్మయిరెడ్డి 588, అత్తిలి జడ్పీ హైస్కూల్ విద్యార్థి దివ్యశ్రీ 583, బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థి వాక్యశ్రీ 583, బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థి గ్లోరీఅక్షర 583, అత్తిలి జడ్పీ హైస్కూల్ విద్యార్థి దివ్య మంజు 53 తణుకు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విద్య హాసిని 588, మహమ్మద్ ఫాతిమా 580, కె.గణేష్ 579 మార్కులు చొప్పున సాధించారని చెప్పారు. ఇంతటి ఉత్తమమైన మార్కులు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు.



