ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ తణుకు పాఠశాల నందు 292 మంది విద్యార్థులు హాజరైనారు.
ప్రధమ శ్రేణిలో 133
ద్వితీయ శ్రేణిలో45
తృతీయ శ్రేణిలో 15
ఉత్తీర్ణులైనారు.
36 మంది విద్యార్థినీ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినారు
ప్రభుత్వ పాఠశాలలలో తణుకు మండలం ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని K. విద్యా హాసిని 588 మార్కులు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ వి ఎస్ ఎన్ పద్మావతి గారు ఒక ప్రకటనలో తెలియజేసినారు.
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో తణుకు మండలం ప్రథమ స్థానం సాధించిన కుమారి కే విద్యా హాసినిని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు పుర ప్రముఖులు పాఠశాల శ్రేయోభిలాషులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను మరియు పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసినారు


