కొమరవరం రోడ్డులోని రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ నూతన క్యాంపస్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్లు ఎల్.కె. త్రిపాటి, విద్యాకాంత్, వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల ఎన్సీసీ పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా త్రిపాటి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




