సమరసతా స్వరం – జాతీయగళం కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి

సమరసతా స్వరం – జాతీయగళం కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి సందర్భంగా వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సమావేశంలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ “వడగాల్పు నా జీవితమైతే -వెన్నెల నా కవిత్వం” అన్న నవయుగ కవిచక్రవర్తి, తన జీవితంలో అడుగడుగునా కులవివక్షను ఎదుర్కొంటూనే, తెలుగు సాహితీలోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, దళితాభ్యుదయవాది “గుర్రం జాషువా” జయంతిని స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తలుగా కవి మోహన్ ప్రసాద్, దారం రాజారత్నం (తెలుగు ఉపాధ్యాయులు ముక్కామల) మాల్యాద్రి(సబ్ రిజిస్టర్ రిటైర్డ్ ), విశిష్టఅతిథిగా కవి కొవ్వలి నాగాంజనేయ శర్మ, సన్మాన గ్రహీతగా ప్రముఖ రచయిత కళారత్న రసరాజు, డా.ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ (హరిబాబు) మాట్లాడుతూ కవి కోకిల గుర్రం జాషువా తన జీవితాన్ని ఎన్నో కుల వివక్షల మధ్య సాగించి తన కవితల ద్వారా సమాజంలో మార్పుకై కృషిచేసిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, బిజెపి నాయకులు రాసాబత్తుల అనుకుమార్, కొడమంచిలి జితేంద్ర, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link