తణుకు పట్టణం హౌసింగ్ బోర్డ్ వద్ద గల విశ్వనరుడు గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సమావేశంలో గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ జాషువా జీవిత విశేషాలను, ఆయన రచించిన కవితలను గురించి వివరించి కవి కోకిల గుర్రం జాషువా తన జీవితాన్ని ఎన్నో కులవివక్షల మధ్య సాగించి తన కవితల ద్వారా సమాజంలో మార్పుకై కృషిచేసిన మహనీయుడని అన్నారు. అనంతరం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


