జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తణుకు నియోజకవర్గ ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ జడీపీటీసీచుక్కా సాయిబాబు పాల్గొనడం జరిగింది. ప్రజాసేవ లక్ష్యంగా స్థాపించబడిన జనసేన పార్టీ సిద్ధాంతాలను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం మరియు ప్రజాసంఖ్యము కోసం అందరం ఐక్యతగా ముందుకు సాగాలని కోరుకుంటూ జనసేన టిడిపి బిజెపి ఐక్యతతో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఎప్పుడు అన్నదమ్ముల కలిసిమెలసి ఉండాలని, చుక్కా సాయిబాబు అన్నారు. రాష్ట్ర గ్రంధాలయ డైరెక్టర్ విశాలాక్షి మండల జనసేన అధ్యక్షులు ఆకేటి కాశి, గ్రామ పార్టీ అధ్యక్షులు సెక్రటరీలు మంగిన శ్రీనివాసు పసుపులేటి గణేష్, టీడీపీ సెక్రటరీ జట్టుబోయిన వెంకటేశ్వరరావు, బిజెపి ఆకుల సుబ్బారావు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొని, దుస్తులు పంపిణి చేశారు.


