భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల దేశ ప్రజలకు అందిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం భీమవరం బిజెపి కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 126 మన్ కీ బాత్ నరసాపురం పార్లమెంట్ భీమవరం బూత్ నెంబర్ 122లో బిజెపి నాయకులు కార్యకర్తల మధ్య వీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మనకి బాత్ స్ఫూర్తితో దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని సంకల్పం చిత్తశుద్ధి, ఆత్మ నిర్భర్భారత్, స్వదేశీ సంకల్ప పత్రం చదివి తద్వారా నాయకులందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, పశ్చిమగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


