కూటమి ప్రభుత్వం సూపర్ సిక్సు… సూపర్ సెవన్ .. సూపర్ హిట్టు చెప్పుకొవడమే కాని ఏ ఒక్కపదకాన్ని పూర్తిగా నేరవేర్చినది లేదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
దేశంలోనే ఎవరికీ లేని విధంగా మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ నువ్వా జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది..?
తప్పులను సరిదిద్దుకుంటూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు ప్రజలను అభివృద్ధి దిశగా నడిపిస్తే, దాన్ని విమర్శించడానికి ‘మెంటల్ సర్టిఫికెట్’ ఉన్న బాలకృష్ణను రంగంలోకి దించింది ఈ కూటమి ప్రభుత్వం.
అధికారంలో ఉండి ప్రజలకు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా, ఇప్పుడు కొత్తగా రాజకీయ డ్రామాలు ఆడుతున్న వారిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు చేస్తున్న అనవసరపు విమర్శలను ప్రజలు పేద చెవినపెట్టి , రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న వైసీపీ నాయకత్వానికి ప్రజలు శ్రీరామరక్షగా ఉన్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.


