వార్త‌లు

ఢిల్లీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి

అమరావతి: ఢిల్లీ ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాల దృష్ట్యా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని,అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతతో పాటు విస్తృత తనిఖీలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

వార్త‌లు

ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి

తణుకు మండలంలో కేంద్రాలను ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ శివ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ కోరారు. సోమవారం తణుకు మండలం కోనాల, దువ్వ గ్రామాల్లో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం మిల్లుకు చేరిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదును జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం

వార్త‌లు

నిరంతర స్ఫూర్తి మంత్రం వందేమాతరం గీతం

వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ దేశ స్వాతంత్ర్య సాధన సంకల్పానికి బలమైన ఊపిరులూదిన గీతాన్ని రాసిన బంకించంద్ర చటర్జీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్ విజయవాడ: భవిష్యత్ భారతదేశ, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రేరణదాయకమైన మంత్రం వందేమాతర గీతమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

వార్త‌లు

చిరంజీవ చిత్రం సూపర్ హిట్ అవడం చాలా సంతోషంగా ఉంది

ఓటీటిలో దుమ్ము రేపుతుంది హీరో రాజ్ తరుణ్ విశాఖపట్నం: నవంబర్ 10 (కోస్టల్ న్యూస్) లవర్ బాయ్ రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ నేపథ్యంలో విజయయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో ఓ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైమ్ లో

వార్త‌లు

నవ్వుల బంతి భోజనంలా ‘ప్రీ వెడ్డింగ్ షో’.. సినిమా.

హీరో తిర్వీర్ ఆనందం విశాఖపట్నం: నవంబర్ 10 (కోస్టల్ న్యూస్) రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని నిర్మించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై హిట్ టాక్ ని సంపాదించుకుంది.ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రమిదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్

వార్త‌లు

కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం

విజయవాడలోని హయత్ హోటల్ లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టూరిజం స్టేక్‌హోల్డర్స్‌తో జరిగిన ఇంటరాక్టివ్ మీటింగ్‌లో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు పర్యాటక పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తే ప్రభుత్వం తరపున భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటానని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా కలిసి దేశ, విదేశాల్లో పర్యటిద్దామన్న మంత్రి దుర్గేష్ యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ తొలి

వార్త‌లు

స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు అభినందనీయం

దివ్యాంగులకు కృత్రియ కాళ్లు పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి మానవత దృక్ఫథంతో స్వచ్ఛంద సేవాల సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో పీఎన్‌ఎస్‌ కిరణ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అంజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణతులసి పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సేవా

వార్త‌లు

వందేమాతరం 150 వ వార్షికోత్సవ వేడుకలు

శ్రీమతి కొండేపాటి సరోజనీదేవి మహిళా కళాశాల (డిగ్రీ & పీజి) అటానమస్, తణుకు స్థానిక యస్.కె.యస్.డి. మహిళా కళాశాల డిగ్రీ అండ్ పిజీ (అటానమస్)లో చరిత్ర మరియు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 సం॥ములు పూర్తి చేసుకొన్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు. లక్ష్మీసుందరీబాయ్ విచ్చేసి మాట్లాడుతూ బంకించంద్రచటర్జీ ఈ గీతాన్ని 1875 నవంబరు 7వ తారీఖున వ్రాశారని, ఈరోజుకి 150

వార్త‌లు

వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవం

వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవం “కార్యక్రమాలలో భాగంగా వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తియ అయిన సందర్భంగా ఈరోజు ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు వందేమాతరం స్ఫూర్తిని మరియు భారతదేశ చరిత్ర మరియు స్వాతంత్య్ర పోరాటంలో దాని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ బంకించంద్ర ఛటర్జీ ఫోటోకు పూలమాలతో సత్కరించి వందేమాతర గీతాలాపన చేసారు. సదరు కార్యక్రమములో మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కొప్పిశెట్టి అలివేలు మంగతాయారు, కూటమి నాయకులు, ఇంచార్జ్ మండల పరిషత్

వార్త‌లు

పాలంగి గ్రామ సచివాలయం లో ఘనంగా “వందేమాతరం” గేయం ఆలాపన

ఉండ్రాజవరం, నవంబర్ 7, 2025 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తుడు బకిం చంద్ర ఛటర్జీ రచించిన “వందేమాతరం” గేయం స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తిని ఇచ్చిందని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ మరియు సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ వివరించారు. బకిం చంద్ర ఛటర్జీ “వందేమాతరం” గేయం రచించి నూట ఏభై సంవత్సరాలు నిండిన సందర్భంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యావత్ భారత దేశంలో జరిగిన కార్యక్రమంలో

Scroll to Top