స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు అభినందనీయం

దివ్యాంగులకు కృత్రియ కాళ్లు పంపిణీ

పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి

మానవత దృక్ఫథంతో స్వచ్ఛంద సేవాల సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి పేర్కొన్నారు. శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో పీఎన్‌ఎస్‌ కిరణ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అంజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణతులసి పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు చూపుతున్న ఆదరణ, వారి సేవలు ఎంతో విలువైనవి అన్నారు. ఒకే వేదికపై సుమారు 60 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేయడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link