సమస్యల రహిత వార్డుగా 48వ వార్డును తీర్చే దిద్దడమే గుడ్ మార్నింగ్ గంకల లక్ష్యం
48వ వార్డు ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటన
ప్రతిరోజు వార్డు ప్రజలకు అందుబాటులో పర్యటన చేస్తూ సమస్యలను పరిష్కారం చూపుతున్న గంకల
48వ వార్డులో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్,జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ప్రత్యక్షమవుతున్నారు.గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం సమస్యల రహిత వార్డుగా 48వ వార్డును తీర్చే దిద్దడమే లక్ష్యంగా ఏర్పాటు చేసినట్టు గంకల కవిత అప్పారావు యాదవ్ తెలిపారు.48వ వార్డు ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో శనివారం స్థానికులతో కలిసి గంకల కవిత అప్పారావు యాదవ్ పర్యటించారు.వార్డును అభివృద్ధి పదంలో ముందుకు తీసుకు వెళ్లడమే గుడ్ మార్నింగ్ గంకల ద్యేయమని పేర్కొన్నారు.ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో మరమ్మతులకు గురి అయిన కాలువలు,డ్రైనేజీలు,రోడ్లను పరిశీలించి త్వరలో వాటి స్థానంలో నూతన రోడ్లు,కాలువలు,డ్రైనేజీలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే అభివృద్ధి పనులకు టెండర్లు ముగిసాయని త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. వార్డులో గల ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో దట్టంగా పెరిగిపోయిన పిచ్చి మొక్కలు,చెట్ల కొమ్మలతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు,అభివృద్ధి పనులకు మరికొన్ని చోట్ల చెట్లు కొమ్ములు అడ్డంగా ఉన్నాయని గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో ఫిర్యాదు అందిందని జివిఎంసి సిబ్బంది, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో కలిసి పేరుకుపోయిన చెత్త,పిచ్చి మొక్కలు,చెట్లు కొమ్మలను తొలగింపు చేపట్టారు.ఈ సందర్భంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ 48వ వార్డులో గల ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ లో శనివారం స్థానికులతో కలిసి గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై పరిశీలించడం జరిగిందని, మరమ్మత్తలకు గురైన రోడ్లు, కాలువలు,డ్రైనేజీలు నిర్మాణాలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని,త్వరలో పనులను ప్రారంభిస్తామని,వార్డు ప్రజలకు నూతన రోడ్లు,కాలువలు, మెట్లు,డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వార్డులో పలుచోట్ల పిచ్చి మొక్కలు,కొమ్మలు పెరిగిపోయి వాటి వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయని పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల దోమలు,కీటకాలు పెరిగి పలు వ్యాధులు ప్రబలుతున్నాయని ఫిర్యాదు అందిందని,అభివృద్ధి పనులకు మరికొన్ని చోట్ల చెట్లు కొమ్ములు అడ్డంగా ఉన్నాయని తక్షణమే జీవీఎంసీ,హార్టికల్చర్ సిబ్బందితో కలిసి వార్డులో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందని పేర్కొన్నారు.గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంనకు విరామం అనేది లేదని గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ప్రతి పిర్యాదు
పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
వార్డ్ ప్రజలకు ఎటువంటి సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని అన్నారు.వార్డ్ ప్రజలు పిర్యాదు పట్ల,అభివృద్ధి కార్యక్రమాల కొరకు నిరంతరం శ్రమిస్తున్న వార్డ్ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ కృషి పట్ల ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఇందిరా నగర్ -1,జై భారత్ నగర్ ప్రజలు ఉన్నారు.


