జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

తణుకు కోర్టు భవనముల సముదాయము శనివారం తణుకు కోర్టుఆవరణలో గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఆధ్వర్యములో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి మొత్తం 1103 కేసులు రాజీ చేసారు. ఇందులో సివిల్ మరియు క్రిమినల్ కేసులు 232, బెంచ్ కోర్ట్ కేసులు 850, ప్రీ లిటిగేషన్ కేసులు 21 రాజీ చేసారు, ప్రతి సంవత్సరం 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ అన్ని కోర్టులలో నిర్వహిస్తారని, కక్షిదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డి.సత్యవతి, కె.కృష్ణసత్యలత, కె.కృష్ణవేణి, పోతార్లంక సాయిరాం, పి.వి.ఎన్. రంజిత్ కుమార్, బెంచ్ మెజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ మెంబర్ కె. పద్మావతి, పోలీసు అధికారులు, బ్యాంకు అధికారులు, టెలిఫోన్ అధికారులు మరియు కక్షిధారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link