పెందుర్తి నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పెందుర్తి నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార దిశగా చర్యలు చేపట్టే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ కార్యక్రమం) ఈ రోజు పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం APOILFED చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ అధ్యక్షతన నిర్వహించబడింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, ఉపాధి, పింఛన్లు, భూ సమస్యలు తదితర ప్రజా సమస్యలను గండి బాబ్జీ దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను సవివరంగా స్వీకరించిన గండి బాబ్జీ., సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ కట్టుబాటును ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


