లయన్ విజన్: ప్రపంచ వ్యాప్త సేవా వారోత్సవాల సందర్భంగా ఆదివారం లయన్స్ జిల్లా 316 G ఆధ్వర్యంలో మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ పైన అవగాహన సదస్సు తణుకు లిటిల్ పారడైజ్ స్కూల్లో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి జిల్లా సర్వీస్ కోఆర్డినేటర్ లైన్ వంక రాజకుమారి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమాన్ని ఫాస్ట్ గవర్నర్ Pdg లైన్ మాదిరెడ్డి బాబుజీ రావు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో Guest of Honor గా లైన్స్ మాజీ గవర్నర్ లైను దామెర రంగారావు అలాగే ఫ్యాకల్టీ గా లైన్ కుడారి ఆనంద్, సైకియాట్రిస్ట్ లయన్ కుడారి సజిని ఫ్యామిలీ కౌన్సిలర్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో ఉన్న ఎనిమిది లయన్స్ క్లబ్బుల యొక్క ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


