అమరావతి: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. ఇది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమేనని.. పరిస్థితిని బట్టి ఇందులో మార్పు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.


