ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలి – మోర్త సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వరప్రసాద్

రైతులకు అవసరమైన అనేక రకాల వ్యవసాయ పనిముట్లపై ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని రైతు సోదరులు వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి.రాజారావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని మోర్త గ్రామంలో సొసైటీ అధ్యక్షులు కరుటూరి వెంకట వర ప్రసాద్ అధ్యక్షతన గ్రామ రైతులకు నిర్వహించిన జిఎస్టిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్ర పరికరాలు, బయో పెస్టిసైడ్, పాల క్యాన్స్, ఆక్వా పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలకు 12 శాతం నుండి 5 శాతానికి టైర్స్,విడిభాగాలు, డ్రోన్ లపై 18 శాతం నుండి 5 తానికి జీఎస్టీ మినహాయింపు దొరుకుతుందన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు, ప్రజలకు జిఎస్టి తగ్గింపు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు ట్రాక్టర్ల తో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఎం.శ్రీనివాసరావు, తహశీల్దార్ పి. ఎన్. డి.ప్రసాద్, ఎంపిడిఓ కార్యాలయ ఏవో వి. వి. వి. ఎస్. రామారావు, సొసైటీ సి.ఇ.ఒ. శ్రీను, వి. హెచ్. ఏ. దీప్తి, సొసైటీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link